గాజులరామారం శ్రీచిత్తారమ్మజాతర ఆదివారం ఆలయకమిటీ ఆధ్వర్యంలో వైభవంగా
నిర్వహించారు. ఉదయం నుంచే మహిళా భక్తులు ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు.
పలుప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలతో గాజులరామారం పోటెత్తింది. జాతరకు పలువురు
రాజకీయ ప్రముఖులు విచ్చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. వేద
పండితుల మంత్రాలు, డప్పుచప్పుళ్ళు, బోనాలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల
జోరు వెరసి జాతర శోభాయమానంగా మారింది. తెల్లవారు జాము నుంచే దేవాలయ కమిటీ
చైర్మన్ కూనా అంతయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాచకొండ బాల్‌రాజ్‌ల
నేతృత్వంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరుగంటలనుంచే భక్తులు తరలి వచ్చి
అమ్మవారికి ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు.
జాతరలో స్థానిక ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గాజులరామారం గ్రామం నుంచి దేవాలయం వరకు ఫలహారం బండి ఊరేగింపును ఆయన ప్రారంభించారు. ఈ పూజల్లో టీడీపీ ఎంపీ తూళ్ళ దేవేందర్‌గౌడ్,కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కేపీ. వివేక్, టీఆర్ఎస్ సీనియర్‌నేత లింగంగౌడ్, టీడీపీ నేత కూన వెంకటేష్‌గౌడ్, కార్పొరేటర్‌లు రావుల శేషగిరివావు. కేఎం.గౌరీష్, బట్టా పాలకృష్ణ, విజయశేఖర్‌గౌడ్, జి.సురేష్‌రెడ్డి, కూన జైకుమార్‌గౌడ్, దేవాలయ కమిటీ సభ్యులు కూన శ్రీనివాస్‌గౌడ్, దుండుముల్ల ఇంద్రసేనారెడ్డి, అముర ఇంద్రసేనాగుప్త, పి. శంకర్‌రెడ్డి, ఆర్.నర్సింహులు, జి. నర్సింహ, ఆర్.సత్తెయ్య, పి. లింగం, భిక్షపతి, కృష్ణారెడ్డి, పెంటారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

0 comments: