గ్రేటర్ పరిధిలో వేసవికిముందే నీటి ఎద్దడి మొదలైంది. పెరుగుతున్న నీటి ఎద్దడిని నివారించేందుకు మెట్రో వాటర్‌బోర్డు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా వచ్చేవర్షాకాలం వరకూ ఉన్న నీటినే సర్దుబాటు చేసేందుకు కసరత్తుచేస్తున్నా రు. నగరం, శివారు ప్రాంతాల్లోని నీటి సమస్యలపై అధికారులు ప్రత్యేకంగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. దీని ప్రకారం ఈసారి వేసవిలో నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు.
కోతలు షురూ! ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో నీటి సరఫరాలో కోతలు మొదలయ్యాయి. ప్రత్యేకించి సరఫరాలో, సమయాల్లోనూ కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా రోజూ నీటి సరఫరా జరిగే ప్రాం తాల్లో ఇక నుంచి రోజు విడిచి రోజు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాల్లో సమయాల్లో, సరఫరా చేసే నీటి మొత్తంలో కోతలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ కోతలు నాలుగు రోజుల క్రితమే మొదలయ్యాయి. గంటన్నరపాటు నీటి సరఫరా జరిగే ప్రాంతాల్లో గంటసేపు, గంటపాటు సరఫరా జరిగే ప్రాంతాల్లో 45 నిమిషాలు సరఫరా చేస్తున్నారు.






















0 comments: