భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేసియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం ఇ క్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా ఓటమి ప్రమాదాన్ని తప్పించుకుని ముందంజ వేసింది. నజోమి ఒ కుహరా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో సైనా 21-11, 14-21, 2-0తో విజయం సాధించింది. 43 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్‌ను సునాయాసంగా సొంతం చేసుకున్న సైనా.. రెండో గేమ్‌లో చేతులెత్తేసింది. అయితే మూడో గేమ్‌లో హైదరాబా దీ 2-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి ఒకుహరా గాయంతో వైదొలగడంతో సైనా సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో సైనా ఏడో సీడ్ జు యింగ్ తాయ్ (తైపీ)తో అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో భారత జోడీ ప్రద్న్య గాద్రె, అశ్విని పొన్నప్ప మూడు గేమ్‌లపాటు పోరాడి ఓడింది. ఇండోనేసియా ద్వయం వారియెల్లా, మరిస్సాతో జరిగిన పోరులో పొన్నప్ప, గాద్రె జోడీ 21-18, 13-21, 13-21తో ఓటమిపాలైంది.






















0 comments: