భారత్, ఇంగ్లండ్ ఐదు వన్డేల సిరీస్‌లో చివరి రెం డు మ్యాచ్‌ల వేదికలు
పేసర్లకు అనుకూలించే అవకాశముంది. నా లుగో వన్డేకు మొహాలీ, ఐదో మ్యాచ్‌కు
ధర్మశాల ఆతిథ్యమివ్వనున్నాయి. ఉత్తర భారతదేశంలో గల ఈ రెండు వేదికల్లో గత
కొన్ని రోజులుగా చలి, మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో వాతావరణ
పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు సహకరించవచ్చని భావిస్తున్నారు. పైగా మొహాలీలో
ఇటీవల భారీ వర్షం కురిసింది. ఉప్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోవడంతో పాటు
గాలిలో తేమ ఎక్కువ గా ఉంది. 23న జరిగే వన్డేకు మొహాలీ స్టేడియాన్ని ఆధునిక
పరికరాలతో సిద్ధం చేస్తున్నట్టు పంజాబ్ క్రికెట్ సంఘం తెలిపింది.
మొహాలీ చేరిన ఆటగాళ్లు: భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆదివా రం మొహాలీ
విచ్చేశారు. సోమవారం ఇరు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించనున్నాయి. మ్యాచ్‌కు
వాతావరణం సహకరిస్తుందని క్రికెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేశాయి. మొహాలీ
స్టేడియం సహజంగానే పేస్, బౌన్స్‌కు సహకరిస్తుందని, శీతల వాతావరణ
పరిస్థితులు సీమర్లకు మరింత ఉపయోగపడవచ్చని చెప్పారు. భారీ వర్షాలు పడ్డా,
స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగ్గా ఉన్నందువల్ల ఆటంకం కలగకపోవచ్చని
తెలిపారు. కాగా మరో మూడు రోజులు వర్షం పడకపోవచ్చని వాతావరణ శాఖ నివేదిక
వెల్లడించింది.






















0 comments: