తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇబ్బందులు
ఎదురవుతాయని ఉత్తరాంధ్ర రక్షణవేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్ ఆందోళన
వ్యక్తంచేశారు. శుక్రవారం విశాఖ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ
రాష్ట్రం విడిపోతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఎడారిగే మారే ప్రమాదం ఉందన్నారు.
నీటికోసం కటకటలాడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయన్నారు. కరువుకాటకా లు మరింత
పెరిగిపోతాయన్నారు. స్వాత్రంత్యం వచ్చినప్పుడు ఏర్పడిన ఒడిసా జలవివాదం
ఇప్పటికీ పరిష్కా రం కాలేదన్నారు. తెలంగాణ ఏర్పడితే మరో అంతరాష్ట్ర
జలవివాదం తలెత్తుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్రకు
చెందిన ప్రజాప్రతినిధులు తగిన విధంగా స్పందించాలన్నారు. ఇప్పటికైనా
ముంచుకొస్తున్న ముప్పును గ్రహించి ఉత్తరాంధ్రకు రక్షణ కల్పించేందుకు గళం
విప్పాలన్నారు.






















0 comments: