ఇప్పటికే ఆర్టిసి చార్జీలు సామాన్యుడిపై భారంగా తయారవుతుంటే మళ్ళి చార్జీలు పెంచడానికి ఆర్టిసి రూపకల్పన చేస్తుంది .కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో కొనుగోలు చేసే సంస్థలకు డీజిల్ ధరపై సబ్సిడీని గురువారం అర్ధరాత్రి నుంచి ఎత్తేయడంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)పై ఏటా అదనంగా రూ.750 కోట్ల వరకూ భారం పడనుంది. ఇప్పుడు ఏం చేయాలా? అని ఆర్టీసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అంతిమంగా ఈ భారం చార్జీల రూపంలో ప్రయాణికులపై పడే ప్రమాద ఘంటికలే మోగుతున్నాయి. అదే జరిగితే చార్జీలు భారీగా పెరగడం ఖాయం.






















0 comments: