అంగారకుడిపై ఓ అతిపెద్ద నది ఆనవాళ్లు వెలుగుచూశాయి. ఈ నది 7కిలోమీటర్ల వెడల్పుతో 1500కిలోమీటర్ల మేర ప్రవహించినట్లు చెబుతున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ)కి చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ ఉపగ్రహం ఈ నది ఫొటోలను భూమికి పంపింది.
'ర్యూల్ వ్యాలీస్ రివర్'గా పిలుస్తున్న ఈ నది దాదాపు 350కోట్ల ఏళ్ల నుంచి 180కోట్ల ఏళ్ల క్రితం మధ్యదైఉంటుందని అంచనా వేస్తున్నారు. నదుల వల్ల భూమిపై సంభవించిన పరిణామాలే అంగారకుడిపైనా చోటుచేసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఈ నదికి ఇరువైపులా ఒడ్డు ఎత్తుగా, ఒరుపుగా ఉందని..ప్రవాహంలో మం చు, మట్టి కొట్టుకురావడం వల్ల ఇలా ఏర్పడి ఉంటుందని ఈఎస్ఏ అభిప్రాయపడింది.






















0 comments: